ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ లో మున్సిపల్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల కు1 తేదీన వేతనాలు ఇవ్వాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ చాలీచాలి వేతనాలతో సతమవుతున్న మున్సిపల్ కార్మికులకు 14 రోజులుగా వస్తున్న వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు ఎంతమంది కమీషనర్లు వచ్చిన కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని ఆయన అన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుని ప్రభుత్వం పట్టించకపోవడం సిగ్గుచేటని, ప్రతి కార్మికుడికి నెలకు 14,500 మాత్రమే వస్తున్నాయని నిజామాబాద్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదని అని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అవుట్సోర్సింగ్ కార్మికులకు 1 తేదీన వేతనాలు ఇవ్వాలని వారికి సమాన పనికి సమాన వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 14 రోజులుగా వేతనాలు వేయకపోవడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వేతనాలు వారి ఖాతాలో వేయకుంటే పెద్ద కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.