మున్సిపల్ కార్మికులు బహుజనులు కాబట్టే వివక్ష
బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, వాటర్ సెక్షన్, డ్రైవర్స్, స్ట్రీట్ లైట్స్ గార్డెన్స్ తదితర మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులంతా బహుజన శ్రామిక కులాలకు చెందిన వారు కాబట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయడంలో కుల వివక్షతను చూపుతున్నాయని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ విమర్శించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన...