Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 7:23 pm Posted by : ramakrishna

మున్సిపల్ కార్మికులకు 1న వేతనాలు చెల్లించాలి

ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పి.వరదయ్య 

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  మున్సిపల్ కార్మికులకు ప్రతినెల 1 తేదీన వేతనాలు ఇవ్వాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పి.వరదయ్య  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 12 తేదీగ వస్తున్న కార్మికులకు వేతనాలు వేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశం అంటుతుంటే కనీసం పూట  గడవకపోవడంతో కార్మికులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు  ఉదయం 5 గంటల నుంచి కార్మికులు తమ పొట్టకూటికోసం మురికి కాలువలు మురికి కంపులో పనిచేస్తుంటే కనీసం ప్రభుత్వం వేతనాలు ఇవ్వకుండా కార్మికుల ను నానా ఇబ్బందులకుగురి చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం ఒకటవ తారీఖున వేతనాలు ఇవ్వమని స్పష్టంగా చెప్పిన మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. పక్క పక్క రాష్ట్రం ఆంధ్రలో  రూ.21000 ఇస్తున్న కానీ తెలంగాణలో మాత్రంరూ.16500  కూడా ఇవ్వడం లేదన్నారు.   వెంటనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని లేనియెడల కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు