Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 5:41 pm Posted by : ramakrishna

మున్సిపల్ సిబ్బంది వారి పనులను సక్రమంగా నిర్వర్తించాలి

 

. . . సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలో రోడ్లపై గుంతలు ఎక్కడపడితే ఉన్నాయని, అక్కడ చెత్త కుప్పలు మురికి కాలువలలో మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయకపోవడం వల్ల అక్కడ ప్రజలు విష జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. నగరంలోని దొడ్డి కొమురయ్య నగర్ లో ప్రజల కోసం సిపిఎం అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం సిపిఎం నగర కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రను సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నిజామాబాద్ జిల్లా బాధ్యులు బుర్రి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగిలిపోయిన మంచినీటి పైపులైన్లను సరిచేసి ప్రజలకు మంచినీరు అందించే విధంగా మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టాలని కోరారు.

 

Municipal staff should perform their duties properly.

 

రిపేర్ అయిన బోర్లను బాగు చేయించాలని, మంచినీరు కోసం కట్టించిన ట్యాంకులలో చెత్త వేయడం జరుగుతుందని, ఆ ట్యాంకులు క్లీన్ చేయించి ప్రజలకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు అందించాలని పేర్కొన్నారు. లేదంటే రేపు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం భగత్ సింగ్ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించి పాదయాత్రను ముగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సురేష్, విగ్నేష్, శాఖ సభ్యులు శ్రీదేవి, లలిత, లక్ష్మీబాయి, రజియా, సంగీత, జయశ్రీ, మాజిత, ఎం.లక్ష్మి, గోదావరి, భాయ్, పంచ పూల తదితరులు పాల్గొన్నారు.

 

Municipal staff should perform their duties properly.