Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 4:38 pm Posted by : ramakrishna

మున్సిపల్ అధికారులు చెప్పింది ఒకటి.. కాంట్రాక్టర్ చేస్తోంది మరొకటి

  • మేకల సంతలో అదనంగా డబ్బులు వసూలు

 

కామారెడ్డి, బతుకమ్మ : గొర్ల, మేకల సంతకు వచ్చే అమాయక ప్రజల వద్ద కాంట్రాక్టర్ అదనంగా రూ.10 వసూలు చేస్తున్న వైనం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొర్ల, మేకల అంగడి బజార్లో చోటుచేసుకుంది. కామారెడ్డి పురపాలక సంఘం వేలం పాటలో గొర్ల, మేకల అంగడి బజార్లో ఒక్కొక్క గొర్రె లేదా మేక కొన్నవారు రూ.40 రూపాయలు చెల్లించాలి అని కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ కాంట్రాక్టర్ ఒక్కొక్క గొర్రె పైన పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు.  సంతలోకి వచ్చే అమాయ ప్రజలను మోసం చేస్తున్నారు.  పురపాలక సంఘం అని 50 రూపాయల ప్రింట్ వేసి రసీదులను చూపిస్తున్నారు.  మున్సిపల్ నుండి 40  రూపాయలు తీసుకోవాలని రూల్ ఉంటే ఆ రూల్ ని పక్క పెట్టి ఒక్కొక్క గొర్రె, మేక పైన పది రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రతి గురువారం దాదాపు 15 వందల నుండి 2 వేల వరకు గొర్లు, మేకలు అమ్మకానికి తీసుకొస్తుంటారు. దీంతో ప్రతి అంగడి రోజు కాంట్రాక్టర్ దాదాపు రూ.20 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Municipal officials say one thing, contractor does another.