Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 6:58 pm Posted by : ramakrishna

ఎసిబి వలలో మున్సిపల్ అధికారులు

 

. . .కాంట్రాక్టర్ నుంచి 15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

 సదాశివ పేట, బతుకమ్మ:

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉర చెరువులోని పూడికను తొలగించిన కాంట్రాక్టర్ కు మంజూరు ఐనా బిల్లు ఇవ్వడానికి లంచం తీసుకున్న ఇద్ధరు మున్సిపల్ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఈసంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ లో జరిగింది. 2025 గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా జరగిని నిమజ్జనం తాలూకు అవశేషాలను తొలిగించిన కాంట్రాక్టర్ సదాశివపేట మున్సిపాలిటీ నుంచి బిల్లు మంజూరు అయింది. వాటిని విడుదల చేయడానికి సదాశివపేట మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎ. రంజిత్ కుమార్ రూ.15,000 లంచం డిమాండ్ చేశారు. మంజూరు అయిన బిల్లుకు లంచం అడగడంతో కాంట్రాక్టర్ ఎసిబిని ఆశ్రయించాడు. సదాశివపేట మున్సిపాలిటీ ఔట్ సోర్స్ కింద వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శివారెడ్డి ద్వార లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరు పరుచగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.