Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 8:48 pm Posted by : ramakrishna

బీజేపీ కార్యాలయంలో మున్సిపల్ ఎలక్షన్స్ సన్నాహక సమావేశం.

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని బీజేపీ ఆఫీసులో మున్సిపల్ ఎలక్షన్స్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ బిజెపి మున్సిపాలిటీ ఇన్చార్జ్ ఇంద్రసేనారెడ్డి, బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చినరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపాలిటి ఇంచార్జ్ ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతూ ఈ కాలంలో అంతరిక్షంలో ఏం చేయాలో, టెక్నాలజీ పరంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో మాట్లాడాల్సిన టైంలో ఇంకా వీధి లైట్స్, రోడ్స్, డ్రైనేజీ, భూముల గురించి మాట్లాడుకోవడం సిగ్గుగా అనిపిస్తుందని అన్నారు. నన్ను నిలువునా కోసిన కూడా రూపాయి రాదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా మరి అభివృద్ధి ఎలా చేస్తావని ప్రశ్నించారు. మనం తినే ప్రతి గింజలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధి అనేది బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని కావున బాన్సువాడ మున్సిపాలిటి లో బీజేపీ ని గెలిపించాలని కోరారు. జిల్లా బిజెపి అధ్యక్షుడు నీలం చిన్నరాజులన్న మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు కార్యకర్తల ఎన్నికలని ఈ ఎన్నికలలో గతంలో బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలను, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని అప్పుడే మున్సిపాలిటీలో బిజెపి జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చీదురు సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ ప్రసాద్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గార్గే, మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, దాకయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్,అనిల్, బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Municipal elections preparatory meeting at BJP office.
Municipal elections preparatory meeting at BJP office.