ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
. . . కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ కొనసాగిన ఓట్ల లెక్కింపు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మున్సిపల్ ఎన్నికలలో కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో పోలైన ఓట్లను సంబంధిత కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ శుక్రవారం లెక్కింపు జరిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగగా, బోధన్ మున్సిపల్...