Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 6:28 pm Posted by : ramakrishna

రేపు మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

 

బోధన్, బతుకమ్మ:

 

బోధన్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. పట్టణంలోని మొత్తం 38 వార్డుల నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రెసిడింగ్ అధికారిగా సబ్ కలెక్టర్ వికాస్ మహాతో వ్యవహరించనున్నారు. ప్రమాణ స్వీకారం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఉంటుందని తెలిపారు. కార్యక్రమం నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రతా, ఇతర ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.