Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2024, 3:27 pm Posted by : ramakrishna

నగరంలో విస్తృతంగా పర్యటించిన మున్సిపల్ కమిషనర్

నిజామాబాద్ సిటీ బతుకమ్మ  :

నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ పరిశీలించారు. 50వ డివిజన్లో చేపడుతున్న కమిటీహాల్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. కమిటీహాల్ నిర్మాణం పూర్తయ్యేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. అదేవిధంగా 35వ డివిజన్లో ఆయా కాలనీలలో రోడ్లు, డ్రెయినేజీలను పరిశీలించారు. అలాగే కార్యక్రమంలో కొర్పొరేటర్ బట్టు రాఘవేందర్, ఏఈ ఇనాయత్ కరీం, సానిటరీ ఇన్స్పెక్టర్ పావని, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ ఫ్లాట్ల ప్రక్రియలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ కింద అప్లికేషన్ చేసుకున్న వారి వివరాలు తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంట సంబంధిత శాఖ అధికారులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Municipal Commissioner who toured the city extensively