రాజకీయ పార్టీల నాయకులతో మున్సిపల్ కమిషనర్ సమావేశం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల తో మునిసిపల్ కమిషనర్ దిలిప్ కుమార్ ఆధ్వర్యంలో పొలింగ్ స్టేషన్ల వివరాలు తెలియజేశారు. ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ ల సంఖ్య 488కి పెంచినట్టు తెలిపారు. ప్రతి బూత్ లో 750 నుండి 770 వరకు ఓటర్లు ఉండేలా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగిందని తెలిపారు. సమావేశంలో వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి, తుది నివేదికను నివేదిస్తామని తెలిపారు....