Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 5:59 pm Posted by : ramakrishna

రాజకీయ పార్టీల నాయకులతో మున్సిపల్ కమిషనర్ సమావేశం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల తో మునిసిపల్ కమిషనర్ దిలిప్ కుమార్ ఆధ్వర్యంలో పొలింగ్ స్టేషన్ల వివరాలు తెలియజేశారు. ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ ల సంఖ్య 488కి పెంచినట్టు తెలిపారు. ప్రతి బూత్ లో 750 నుండి 770 వరకు ఓటర్లు ఉండేలా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగిందని తెలిపారు. సమావేశంలో వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి, తుది నివేదికను నివేదిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ రవీంద్ర సాగర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.