సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నగరంలోని సర్కిల్ కార్యాలయాలను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తనిఖీ చేశారు. బుధవారం ఉదయం  సర్కిల్ నంబర్ 1, సర్కిల్ నంబర్ 2లోని హమాల్ వాడి, శివాజినగర్ లోని జోన్ కార్యాలయాలను మున్సిపల్ కమిషనర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో మున్సిపల్ కార్మికుల హాజరు రిజిస్ట్రార్ ను పరిశీలించారు పారిశుద్ధ్య కార్మికుల హాజరును పరిశీలించారు.కార్మికుల హాజరును పరిశీలించి, విధులు సక్రమంగా నిర్వహించాలని జోన్ ఇంచార్జిలకు సూచించారు. సమయానికి హాజరు కానీ వారిని గుర్తించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు....