Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 2:04 pm Posted by : ramakrishna

సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నగరంలోని సర్కిల్ కార్యాలయాలను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తనిఖీ చేశారు. బుధవారం ఉదయం  సర్కిల్ నంబర్ 1, సర్కిల్ నంబర్ 2లోని హమాల్ వాడి, శివాజినగర్ లోని జోన్ కార్యాలయాలను మున్సిపల్ కమిషనర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో మున్సిపల్ కార్మికుల హాజరు రిజిస్ట్రార్ ను పరిశీలించారు పారిశుద్ధ్య కార్మికుల హాజరును పరిశీలించారు.కార్మికుల హాజరును పరిశీలించి, విధులు సక్రమంగా నిర్వహించాలని జోన్ ఇంచార్జిలకు సూచించారు. సమయానికి హాజరు కానీ వారిని గుర్తించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

Municipal Commissioner inspects circle offices