అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించిన మున్సిపల్ చైర్మన్

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ గురువారం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రిన్సిపాల్‌తో సమావేశమై కళాశాలలోని పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఫ్యాకల్టీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీ ఇతర సిబ్బంది కొరత ఉందని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సిబ్బంది కొరత సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకానికి...