Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:44 pm Posted by : ramakrishna

అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించిన మున్సిపల్ చైర్మన్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ గురువారం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రిన్సిపాల్‌తో సమావేశమై కళాశాలలోని పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఫ్యాకల్టీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీ ఇతర సిబ్బంది కొరత ఉందని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సిబ్బంది కొరత సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, కౌన్సిలర్లు తిరుపతి, గఫర్, విద్యాసాగర్, పప్పు వెంకటి, రాములు, వసీం, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

 

Municipal Chairman visits Advanced Technology Center