Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 5:52 pm Posted by : ramakrishna

శ్రీనీ డెవలపర్స్ లో అక్రమ కట్టడాలకు బల్ధియా నోటీసులు

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనీ డెవలపర్స్ లో  పబ్లిక్ పార్క్ కోసం కేటాయించిన స్థలంలో చెపట్టిన నిర్మాణాలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గంగాస్థాన్ ఫేస్ 2లోని శ్రీనీ డెవలపర్స్ లోనిొ వెంచర్ లో కొందరు పార్క్ స్థలములో  ఆక్రమంగా ఇండ్లు కట్టుకున్నారని స్థానిక నివాసులు బల్ధియా అధికారులకు ఫిర్యాదు చేశారు. దానితో గురువారం రూరల్ తహసీల్దార్, మున్సిపల్ ఎన్ ఫోర్స్ మెంట్, టౌన్ ప్లానింగ్  అధికారుల నోటీసులు జారీ చేసి ఇంటికి అతికించారు. శ్రీని వెంచర్ లో 2,000 గజాలు బల్దియాకు సంబంధించిన పది శాతం భూమి అని తెలిపారు. సంబంధిత స్థలంలో ఇండ్లు కట్టుకున్న వారికి మూడవసారి నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో సంబంధిత స్థలం డాక్యుమెంట్లు సమర్పించాలి  లేకపోతే కూల్చేస్తామని అధికారులు తెలిపారు. బల్ధియా పార్క్ కు కేటాయించిన స్థలంలో  అక్రమ కట్టడాలు వెంటనే కూల్చివేయాలని స్థానిక కాలనీ వాసులు అధికారులను డిమాండ్ చేశారు.