ఏసీబీకి పట్టుబడిన ములుగు డీఈవో

ములుగు, బతుకమ్మ : ములుగు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో ఏసిబి దాడులు చేశారు. రూ.20వేలు లంచం తీసుకుంటూ జిల్లా విద్యా శాఖ అధికారి పాణిని, మరో సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారు. కన్నాయిగూడెం మండలం లక్ష్మి పురం లో పనిచేసే ఉపాధ్యాయుడు సిక్ లీవ్ పూర్తి చేసుకొని మళ్ళీ పోస్టింగ్ అడిగితే అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసిబి రైడ్ తో జిల్లా విద్యా శాఖలో చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డిలో పంచాయతీ కార్యదర్శి.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి...