Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 5:48 pm Posted by : ramakrishna

ఏసీబీకి పట్టుబడిన ములుగు డీఈవో

ములుగు, బతుకమ్మ : ములుగు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో ఏసిబి దాడులు చేశారు. రూ.20వేలు లంచం తీసుకుంటూ జిల్లా విద్యా శాఖ అధికారి పాణిని, మరో సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారు. కన్నాయిగూడెం మండలం లక్ష్మి పురం లో పనిచేసే ఉపాధ్యాయుడు సిక్ లీవ్ పూర్తి చేసుకొని మళ్ళీ పోస్టింగ్ అడిగితే అధికారులు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసిబి రైడ్ తో జిల్లా విద్యా శాఖలో చర్చనీయాంశంగా మారింది.

  • సంగారెడ్డిలో పంచాయతీ కార్యదర్శి..

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామ పంచాయతీలో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫిర్యాదుదారుడు తన ఓపెన్ ప్లాట్‌కు ఇంటి నంబర్ కేటాయించాలని, వాటర్ సర్వీసింగ్ షెడ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి రూ.8,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు వెంటనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు ముందస్తుగా పన్నిన వ్యూహంతో సోమవారం ఆమెను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. పట్లోళ్ల నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మరింత విచారణ జరుపుతున్నారు.

Mulugu DEO arrested by ACB