Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 6:57 pm Posted by : ramakrishna

ముమ్మాలనేని సహకారంతో ముక్కంటి ఆలయం

  • 4కోట్లతో ఆలయ పునర్నిర్మాణం
  • అంగరంగ వైభవంగా ఆలయ విగ్రహ  ప్రతిష్టకు ముస్తాబు

 

బతుకమ్మ, కోటగిరి : కొన్ని  ఏండ్ల క్రితం రాత్రి గుట్టలోనీ రాళ్ళ మధ్య పశువుల కాపరి కంటపడ్డ స్వయంభు శివలింగం      అడ్కాస్ లింగమయ్యగా పేరుగాంచి పూజలందుకుంటున్న ఆలయానికి నూతన హంగులతో పునర్నిర్మానం చేసుకొని విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధంగా ఉంది. కోటగిరి మండలం  అడ్కాస్ పల్లి గ్రామానికి చెందిన ముమ్మలనేని రాజశేఖర్  అనే వ్యక్తి సొంత ఊరు పై ఉన్న మక్కువతో  పురాతన ఆలయాన్ని తొలగించి  రెండు సంవత్సరాల క్రితం ఆలయ పునర్నిర్మాణానికి బాటలు వేసి  నాలుగు కోట్ల రూపాయల వెచ్చించి నూతన హంగులతో ఆలయాన్ని నిర్మించారు. ఈనెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముమ్మలనేని  రాజశేఖర్ మాట్లాడుతూ…  పరమేశ్వడుని అనుగ్రహంతోనే  ఆలయ నిర్మాణానికి పునాది పడిందని రెండు సంవత్సరాలుగా నిరంతరం అహర్నిశలు కష్టపడి సుమారు నాలుగు కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మానం చేసుకొని 8వ తేదీ నుండి 10 తేదీ వరకు వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

Mukkanti Temple in collaboration with Mummalane