త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహరం..

  రుద్రూర్, బతుకమ్మ :   సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించిన పవిత్ర హాజ్రాత్ మొహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ అమరత్వాన్ని మొహర్రం స్మరింపజేస్తుందని మంచితనం, త్యాగం, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలిచిన ఇమామ్ హుస్సేన్ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని మతగురువు మొహమ్మద్ అబ్దుల్ భారీ ఖాద్రి పేర్కొన్నారు. శుక్రవారం జూమా నమాజ్ అనంతరం రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ ఖానేఖ ఏ ఖాద్రియలో మొహర్రం పండగ సందర్బంగా హాజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాలను స్మరించుకుటుంటూ బరువెక్కిన హృదయలతో...