Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 6:40 pm Posted by : ramakrishna

త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహరం..

 

రుద్రూర్, బతుకమ్మ :

 

సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించిన పవిత్ర హాజ్రాత్ మొహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ అమరత్వాన్ని మొహర్రం స్మరింపజేస్తుందని మంచితనం, త్యాగం, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలిచిన ఇమామ్ హుస్సేన్ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని మతగురువు మొహమ్మద్ అబ్దుల్ భారీ ఖాద్రి పేర్కొన్నారు. శుక్రవారం జూమా నమాజ్ అనంతరం రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ ఖానేఖ ఏ ఖాద్రియలో మొహర్రం పండగ సందర్బంగా హాజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాలను స్మరించుకుటుంటూ బరువెక్కిన హృదయలతో ప్రతేక ప్రార్థనలు చేసారు. ఈ సందర్బంగా ఖానేఖ ఏ ఖాద్రియ వ్యవస్థపాకులు మత గురువు మొహమ్మద్ అబ్దుల్ భారీ ఖాద్రి మాట్లాడుతూ 1400 ఏళ్ల కిందట 60 రోజులపాటు జరిగిన యదార్థ ఘటనకు ప్రతిరూపం ఈ పండుగ. ఖలీఫా హజ్రత్‌ అలీ తనయులు ఇమామే హుస్సేన్‌, ఇమామ్‌ హస్సేన్‌. హజ్రత్‌ అలీ తరువాత ప్రజలు హాజ్రత్ ఇమామ్‌ హసన్‌ను ప్రతినిధిగా ఎన్నుకుంటారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్‌గా ఉన్న మావియాకు అధికార దాహంతో రాజ్యాధికార కాంక్ష పెరుగుతోంది. దీంతో యుద్ధం ప్రకటించి హాజ్రత్ ఇమామ్‌ హస్సేన్‌ను గద్దెదించాలనుకుంటాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే బాధతో రణ నివారణ కోసం హాజ్రత్ ఇమామ్ హస్సేన్‌ తన పదివిని త్యజిస్తారు. మావియా కుట్ర ఫలిస్తుంది. అయితే కొద్ది వ్యవధిలోనే హాజ్రత్ ఇమామ్ హస్సేన్‌ విష ప్రయోగానికి గురై హతుడవుతారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్‌ను రాజ్యాధికారిగా నియమిస్తాడు. చర్చల కోసంహాజ్రత్ ఇమామ్‌ హుస్సేన్‌ రాజధాని కుఫాకు బయల్దేరుతాడు. యజీద్‌కు విషయం తెలుస్తుంది. పాషాణ హృదయుడైన అతడు హాజ్రత్ ఇమామ్‌ హుస్సేన్‌ పరివారాన్ని కర్బల అనే చోట అడ్డగిస్తాడు. తనను రాజుగా అంగీకరించాలంటూ యుద్ధానికి కాలు దువ్వుతాడు.ఆ విధంగా పది రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో హాజ్రత్ ఇమామ్ హుస్సేన్‌ పరివారం వీరోచితంగా పోరాడి అశువులుబాస్తరు. హాజ్రత్ ఇమామ్ హుస్సేన్‌ ఒక్కరే మిగులుతారు. పదో రోజు హాజ్రత్ ఇమామ్ హుస్సేన్‌ ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు దొంగచాటుగా వెన్నుపోటు పొడిచి హత్యచేస్తారు. సత్యానిదే విజయం. కష్టాలు ఎంత పెద్దవైనా అల్లా్‌హపై విశ్వాసం ఉంచినవారికి ఆయన సాయం తప్పకుండా లభిస్తుందని ప్రతి ముస్లిం తన జీవితాన్ని పరిశీలించుకొని, తన ఇమాన్‌’ (దైవంపట్ల విశ్వాసం)ను బలోపేతం చేసుకోవడానికి, అల్లా్‌హకు మరింత చేరువ కావడానికి అపూర్వమైన అవకాశాన్ని ఈ మాసం అందిస్తుందని, ప్రతి ఒక్కరు సత్యం,ధర్మం వైపు నాడవాలని అల్లహ్ చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరు పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోమహమ్మద్ అబ్దుల్ హది ఖద్రి, అహ్మద్ జబ్రతుల్లా ఖాద్రి,మజిద్ సదర్ షేక్ మొహమ్మద్, షేక్ చాంద్ పాషా, సత్తార్ ఖాద్రి, షేక్ జావీద్ ఖాద్రి, షేక్ లతీఫ్ ఖాద్రి, ఫహీం ఖద్రి,ఇర్ఫాన్ ఖాద్రి, తదితరులు పాల్గొన్నారు.

 

Muharram is a symbol of sacrifice and the upholding of righteousness.