Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2024, 6:12 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యేను సన్మానించిన ముదిరాజులు

బతుకమ్మ, భీంగల్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘ సభ్యులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని గురువారం ఘనంగా సన్మానించారు. ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయానికి ధూప, దీప నైవేద్యాల పథకం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినందుకు గాను మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే ను కలిసి శాలువా, పూలమాలతో సన్మానించారు.దాంతో పాటుగా ముదిరాజ్ సంఘం నిర్మాణం కోసం రూ.20 లక్షల మంజూరు చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి మహిమ గలదని, అమ్మ వారు శక్తి కల దేవత అని అన్నారు.మహిమన్వితురాలైన అమ్మ వారి ఆశీస్సులు నా మీద ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమం లో మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం , ముద్ధిరాజ్ సంఘం పెద్ద మనుషులు
గారాయి రవి , మొండి రవి , లోపం మహిపాల్ , టికాయి బాలయ్య , పసుల మహేష్ , శ్రీనివాస్ , దమ్ముయి గంగాధర్ ,గౌరయి జీవన్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.