ముగిసిన ముదిరాజ్ సంఘం ఎన్నికలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ముదిరాజ్ వీధి ముదిరాజ్ సంఘంలో ఆదివారం జరిగిన ఎన్నికలు రాత్రి వరకు జరిగాయి. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటింగ్ సరళి జరగగా, రెండు గంటల నుండి ఏడు గంటల వరకు ఓటింగ్ లెక్కింపు జరిగింది. ఎన్నికల్లో ముదిరాజ్ సంఘం అధ్యక్షునిగా జాలిగం రాందాస్ ఎన్నిక అవ్వగా, ఉపాధ్యక్షులుగా అంబే సుధాకర్, పెండరి శ్రీధర్ లు, ప్రధాన కార్యదర్శిగా బాలరామ్ లక్ష్మీనారాయణ, కోశాధికారి జెల్లా సురేందర్ లు ఎన్నికయ్యారు....