Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 April 2025, 4:55 pm Posted by : ramakrishna

మిషన్ భగీరథ లో బురద, కలుషిత నీరు, తాగేదెలా

  • 20రోజులుగా ఇదే తీరు
  • నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న అధికారులు
  • పట్టించుకునే నాదుడే లేడా

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ : సురక్షితమైన మంచి నీటిని అందిస్తున్నాం అని ప్రభుత్వం చెబుతున్నా,. అది క్షేత్ర స్థాయి లో అమలు కావడం లేదు. ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా బురద, కలుషిత నీరు వస్తుందని గత ఇరవై రోజులుగా కలుషిత నీరు వస్తున్నా,, అధికారులు చోద్యం చూస్తున్నారని, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు తాగడం వలన రోగాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

పైపులు లికేజి, మరమ్మత్తులు ఆలస్యం కారణంగా కలుషిత నీరు నిత్యం ఎక్కడో ఒకచోట లికేజి కారణంగా, మరమ్మత్తులు చేయకపోవడంతో బురదతో కూడిన కలుషిత నీరు వస్తుందని అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి, మంచి నీటిని సరఫరా చేయాలనీ ప్రజలు వాపోతున్నారు.

  • పదిహేను, ఇరవై రోజులుగా కలుషిత నీరు
  • నాగరాజు, అన్నాసాగర్

Mud, polluted water, drinking water in Mission Bhagiratha

గత పదిహేను, ఇరవై రోజులుగా కలుషిత నీరు వస్తుంది. తాగాడానికి దేవుడెరుగు కనీసం వాడకానికైనా ఉపయోగపడని నీరు ఎందుకు అని తెలిపారు.

  • బురదతో కూడిన కలుషిత నీరు
  • సుగుణకర్, అన్నాసాగర్

Mud, polluted water, drinking water in Mission Bhagiratha

మిషన్ భగీరథ లో నీటి కలుషితం అయి వస్తుంది. బురదతో కూడిన కలుషిత నీరు చాలా వస్తుంది.చాలా రోజుల నుండి వస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను.

Mud, polluted water, drinking water in Mission Bhagiratha

ఈ విషయమై మిషన్ భగీరథ ఏ ఈ వినోద్ ని వివరణ కోరగా, నీటి సాంపిల్స్ సేకరించిన తరువాత చర్యలు తీసుకుంటామని పట్టనట్లు తెలిపారు.

Mud, polluted water, drinking water in Mission Bhagiratha15247