భీమ్ గల్, బతుకమ్మ : ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 17 బెస్ బాల్ ఎంపిక పోటీల్లో జడ్పిహెచ్ ఎస్ ముచ్కూర్ విద్యార్థులు విజయం సాధించి స్టేట్ లెవల్ బెస్ బాల్ కు ఎంపికాయ్యారు. ఇటీవలే ఆర్మూర్, సుద్దపల్లి లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అండర్ 17 బెస్ బాల్ పోటీల్లో ముచ్కూర్ హైస్కూల్ కు చెందిన అన్నారం రేణుషీత్ (10వ తరగతి) కర్రోళ్ల హారిక(9వ తరగతి )లు పాల్గొని ప్రతిభ కనబర్చి స్టేట్ లెవల్ గేమ్స్ కు ఎంపికయ్యారు.స్థానిక పీ. డీ ఎం. సుజాత ఆధ్వర్యంలో స్టేట్ లెవల్ బెస్ బాల్ కు ఎంపికైన ఇరువురు విద్యార్థులను, పీ. డీ ని హెడ్ మాస్టార్ట్ అరే రమేష్, ఉపాధ్యాయ బృందం, స్థానిక వీడీసీ సభ్యులు అభినందించారు.