ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంటులో తీసుకురావాలి
నిజామాబాద్, బతుకమ్మ : ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం అర్సపల్లి గ్రామ కచేరిలో బి. సాయిలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో భూమయ్య మాట్లాడారు. దేశంలో వివిధ ఉత్పత్తులను తయారు చేస్తున్న వాటి యజమానులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకుంటున్నారు. పంట పండించే రైతు మాత్రం తన పంటలకు ధర నిర్ణయించుకునే అవకాశం లేదన్నారు. రైతు పండించిన...