. . . సుమారు 60 నుంచి 70 ఎకరాలు
. . . బుక్కులు మాత్రం యాజమాన్యం దగ్గరనే
. . . బాండులు రాయించుకున్న వైనం
భిక్కనూరు, బతుకమ్మ :
తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన అసైన్ భూములను ఎవరైనా ఇతరులకు ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తులకు లేదా కంపెనీలకు విక్రయించడం చట్ట విరుద్ధం కానీ భిక్కనూరు మండలం కేంద్రంలో ఎంఎస్ఎన్ కంపెనీ అసైన్ భూములను ఆక్రమించినట్లు వార్డు మెంబర్ కర్రోళ్ల రాజు గజ్జె వేణు ఆరోపిస్తూ ఎమ్మార్వో కు సోమవారం వినతిపత్రం అందజేశారు. 564 సర్వే నెంబర్లు సుమారు 60 నుంచి 70 ఎకరాల భూమిని సుమారు 25 మంది రైతుల నుంచి విక్రయించినట్లు ప్రాథమిక సమాచారం ఉందని దీనిపై రెవెన్యూ అధికారులు వెంటనే విచారణ చేపట్టి పూర్తి వివరాలు తెలపాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఎంఎస్ఎన్ కంపెనీ యథేచ్చగా రైతులకు మాయమాటలు చెప్పి అసైన్ భూములను తక్కువ ధరలకే విక్రయిస్తున్నట్లు వారు ఆరోపించారు. వెంటనే అధికారులు దీనిపై ప్రజా ప్రతినిధుల, ప్రజల సమక్షంలో విచారణ చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో మండలంలో పెద్ద ఉద్యమం చేపడతామని వారు డిమాండ్ చేశారు.