Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 4:02 pm Posted by : ramakrishna

ఎస్ఐని సన్మానించిన ఎంఆర్పిఎస్ నాయకులు

బతుకమ్మ కోటగిరి-  కోటగిరి పోలీస్ స్టేషన్ ఇటీవల బదిలీ పై వచ్చి బాధ్యతలు స్వీకరించిన స్థానిక ఎస్సై సునీల్ ను ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కే పోచిరాం మాదిగ ఆయన బృందం తో మర్యాదపూర్వకంగా కలిసి పూల దండ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..సబ్బండ కులాల పక్షాన వివిధ సమస్యలు ఉన్న దానిని సామాజిక కోణంలో పరిష్కరించాలని ఎస్సై సునీల్ వివరించి,, దళిత బహుజనుల కోసం వివిధ గ్రామాలలో కొంతమంది యువకులు  మత్తు పదార్థాలకు బానిసనవుతున్న దానిని అరికట్టడం కోసం మా  వంతు కృషి చేస్తమని తెలపడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కోటగిరి మండలం ఉపాధ్యక్షులు: శ్రీనివాస్ కన్నం శ్రీనివాస్ మాదిగ, (మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్) ఉమ్మడి మండల అధ్యక్షులు నక్కేవార్ హరిదాస్ మాదిగ, ఎంఆర్పిఎస్ బోధన్ డివిజన్ నాయకులు : బూరె శంకర్ మాదిగ, హస్కుల లాలయ్య మాదిగ, కొండాపూర్ పోశెట్టి మాదిగ, కర్నింగ్ శ్రీకాంత్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.