Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2024, 12:59 pm Posted by : ramakrishna

6నుంచి ఎమ్మార్పీఎస్ బైక్ యాత్ర

కామారెడ్డి, బతుకమ్మ: ఎస్సీ వర్గీకరణతోపాటు మరో 10 డిమాండ్ల సాధన కోసం ఈనెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న బైక్ యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రుసేగాం భూమయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి నుంచి బైక్ యాత్ర ప్రారంభమై అన్ని మండలాల మీదుగా నెలరోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. మాదిగ ఉపకులాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. భూమయ్య మాదిగ, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ చార్జీలు తదితరులు పాల్గొన్నారు.