- మేం ఎలా చదువుకోవాలి సారూ?
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు
రుద్రూర్, బతుకమ్మ: గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపిపిఎస్ గాంధీ పాఠశాల ఊరుస్తుంది. ఈ పాఠశాలకు మన ఊరు.. మన బడి కింద రూ.11.84 లక్షలు మౌళిక వసతుల కల్పన పనుల కొరకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యాయి. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రెండు సంవత్సరాలకే పాఠశాల పై కప్పు భాగానికి క్యూరింగ్ సరిగ్గా చేయకపోవడం వలన పాఠశాలలోని తరగతి గదులు, వంట గది మొత్తం కురిసిన వర్షానికి ఊరుస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆరోపించారు.

కురిస్తున్న వర్షానికి తరగతి గదులు ఊరుస్తుండడంతో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంతోనే పాఠశాల మొత్తం ఊరుస్తుందని ఆమే పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
