రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో గల ఇందిరా నగర్ అంగన్ వాడీ కేంద్రాన్ని సోమవారం ఎంపిఓ అరవింద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారుల హాజరు పట్టికను పరిశీలించారు. అంగన్ వాడీ కేంద్రానికి సరఫరా అయ్యే పాలు, గుడ్లు తదితర సరుకుల వివరాల గురించి అంగన్ వాడీ టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. ఆయన వెంట సూపర్ వైజర్ శ్రీలత, అంగన్ వాడీ టీచర్ రత్న కుమారి తదితరులు ఉన్నారు.