Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 6:41 pm Posted by : ramakrishna

పోలీస్ కమిషనర్‌ను కలిసిన ఎంపీజే ప్రతినిధులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) ప్రతినిధుల బృందం సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నగరంలోని వివిధ సామాజిక సమస్యలు, శాంతి భద్రతల అంశాలపై చర్చించారు. అలాగే, సంస్థ కార్యకలాపాల గురించి వివరించి, తెలుగు ఖురాన్ అనువాద ప్రతిని పోలీస్ కమిషనర్‌కు బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్, ఎంపీజే నగర అధ్యక్షుడు మహమ్మద్ జహీరుద్దీన్, డా. సజ్జాద్, రూపేష్ రెడ్డి, అస్లం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

MPJ representatives meet with Police Commissioner