Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2024, 12:13 pm Posted by : ramakrishna

గ్రామాల్లో పర్యటించిన ఎంపీడీవో శ్రీనివాస్

బతుకమ్మ, జుక్కల్ :  జుక్కల్ మండలంలోని చండేగాం, మాదాపూర్, హంగర్గా గ్రామాల్లో శనివారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పర్యటించారు. గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. ప్రతిరోజు గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీకి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. అంగన్ వాడి సెంటర్ పరిశీలించారు. ప్రతిరోజు అంగన్వాడి సెంటర్లు తెరిచి ఉంచాలన్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే ఆస్కారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల రికార్డులను పరిశీలించి, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అడిగి తెలుసుకున్నారు.గ్రామాల్లో మురికి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు,టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

MPDO Srinivas visited the villages