ప్రజావాణిని అడ్డుకొన్న పురానిపేట్ గ్రామస్థులు
భూకబ్జాలకు అధికారుల వత్తాసుపై ఆగ్రహం
భీమ్ గల్, బతుకమ్మ
తమ గ్రామానికి చెందిన పశువులను నిలుపుకోనే స్థలాన్ని భీమ్ గల్ కు చెందిన కొందరు కబ్జా చేస్తున్నారని ఎన్ని సార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన పురాణిపెట్ గ్రామస్థులు ఎంపీడీఓ ఆఫీస్ ను దిగ్బందం చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండగా గ్రామ ప్రజలు, మహిళాలు పెద్ద ఎత్తున ఎంపీడీఓ ఆఫీస్ కు తరలివచ్చి ఆఫీస్ ప్రధాన ద్వారం వద్ద బైఠయించి ధర్నా నిర్వహించారు. తమ గ్రామానికి చెందిన బర్లు, ఆవులను నిలిపి, స్వేధ తీర్చే అసైండ్ భూమిని భీమ్ గల్ కు చెందిన కొందరు కబ్జా చేస్తున్నారన్నారు. ఈ విషయమై కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి ప్రజవాణిలో ఫిర్యాదు చేసామని, స్థానిక ఎంపిడీఓ ఆఫీస్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసినప్పటికి తహసీల్దార్, రెవిన్యూ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కబ్జాదారులకే మద్దత్తునిస్తున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఈ విషయంలో విచారణ జరిపి గ్రామస్థులకు తగు న్యాయం చెయ్యాలని, కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
