నర్సరీలను పరిశీలించిన ఎంపీడీవో

బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన  వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడానికి మొక్కలు పెంచుతున్న నర్సరీలను శుక్రవారం మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి పరిశీలించారు. మోర్తాడు మండలంలోని షేట్ పల్లీ, ధర్మోరా, దొనకల్ గ్రామాల్లో గల నర్సరీలను ఆమె పరిశీలించారు. తెలియజేశారు. ఎండాకాలం కావున మొక్కలకు పదేపదే నీటి తడులు అందిస్తూ మొక్కలను సంరక్షించాలని క్షేత్ర సహాయకులను సూచించారు. మొక్కలు ఎక్కడ కూడా ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.