ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీవో
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం లోని శెట్ పల్లీ గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పనులను మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి పరిశీలించారు. ఊర చెరువులో జరుగుతున్న పని దగ్గరికి వెళ్లి కూలీలతో పని విషయాలు అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ లను పరిశీలించారు. అనంతరం అక్కడినుండి చెరువు పక్కనున్న నర్సరీకి వెళ్లి నర్సరీ నిర్వహణ పనులను పరిశీలించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు చంద్రమోహన్, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.