Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2024, 7:35 pm Posted by : ramakrishna

 మాజీ మార్కెట్ కమిటీ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

బతుకమ్మ, పిట్లం

పిట్లం మండల కేంద్రంలో గత 13 రోజుల క్రితం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి మరణించిన విషయాన్ని తెలుసుకున్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ బాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ లో ఉండి పార్టీకి ఎదురు లేని సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా, కాంగ్రెస్ పార్టీ సీనులకు సేవలు చేస్తారని ఆయన గుర్తు చేశారు. అనంతరం గ్రామ మైనార్టీ కార్యకర్తలు ఈద్గా వద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. కమిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని బుడగజంగా కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు.  కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు. ఏనుగండ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమాన్లు, సూరత్వంత్ రెడ్డి, కరీం, బషీద్,రవి, గుండు నరేందర్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

MP visited the family of the former market committee