జానకంపేట్ గూడ్స్ షెడ్ ను జాతికి అంకితం చేయనున్న ఎంపీ
నిజామాబాద్, బతుకమ్మ : దక్షిణ మధ్య రైల్వే భారతీయ రైల్వే అభివృద్ధి పథంలో కీలక పాత్ర పోషిస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికుల సేవలు వంటి విభిన్న రంగాల్లో విశేషంగా తోడ్పడుతోంది. ఈ క్రమంలో సరుకు రవాణా విభాగాన్ని మరింత విస్తరించేందుకు పలు సరుకు రవాణా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ ఒరవడిని కొనసాగిస్తూ నిజామాబాద్ ప్రాంతం సమీపంలో సరుకు రవాణా, వస్తువుల నిర్వహణ సౌకర్యాలను మరింత మెరుగుపరచడం, అలాగే స్థానిక వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా ఈ జోన్‌లోని హైదరాబాద్ డివిజన్...