. . . సురేష్ షెట్కర్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రి రోగులకు పండ్ల పంపిణీ
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలను బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎంపీ సురేష్ షెట్కర్ ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసద్ బిన్ మోసీన్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్, షాహబ్, రవీందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, గుడాల నగేష్, కొట్టం గంగాధర్, నాయకులు గోపాల్ రెడ్డి, నార్ల రవీందర్, ఎజాజ్, హకీమ్, నర్సన్నచారి, శివదయాళ్, వెంకన్న, సెట్ రమేష్, కాశీరాం, షోయెబ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
