Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 4:33 pm Posted by : ramakrishna

ఎంపీ సురేష్ శెట్కర్ కార్యకర్తలకు సమాచారం ఇచ్చి మండలానికి రావాలి

బతుకమ్మ, బిచ్కుంద : జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ శెట్కర్ తన పర్యటనలో భాగంగా బిచ్కుంద మండలానికి వచ్చే క్రమంలో బిచ్కుంద మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు గానీ, కార్యకర్తలకు గానీ, సమాచారం ఇచ్చి మండలానికి రావాలని తద్వారా కార్యక్రమ ప్రణాళికను రచించుకొని కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటారని బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్ తెలియజేశారు. ఎటువంటి సమాచారం లేకుండా ఉన్నపలంగా కార్యక్రమాలకు హాజరు కావడంతో కార్యకర్తల మధ్య సమన్వయం లోపించి కార్యక్రమ నిర్మాణంలో అవాంతరాలు జరుగుతున్నాయని దీనిని పరిగణలోకి తీసుకొని ఎంపీ సురేష్ శెట్కర్ మండలానికి వచ్చేటప్పుడు కార్యకర్తలకు సమాచారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు దర్పల్ సంతోష్, సాయిని అశోక్, దర్పల్ దశరథ్, చిన్ సాబ్ సోపాన్, బాలకృష్ణ, సాయిని బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.