ఎన్నికల కమిషన్‌కు ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు
హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ కార్డులు పంచుతున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు “ఓటర్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్” పేరుతో బహిరంగంగా దుకాణం పెట్టుకుని కార్డులను పంచుతున్నారని తెలిపారు. “ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎట్లా వచ్చాయి? జీహెచ్ఎంసీ కమిషనర్లు, ఎన్నికల అధికారులూ ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని రఘునందన్ రావు ప్రశ్నించారు. కొత్త ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్...