లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. రాజమండ్రి జైలులో మిథున్‌రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.