- బీజేపీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి
కమ్మర్ పల్లి, బతుకమ్మ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎం. పీ ల్యాడ్స్ నుండి రూ. 4లక్షల 90వేల నిధులను మంజూరు చేయించినట్లు బీజేపీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. అందుకు సంబందించిన ప్రొసీడింగ్ కాపీని శుక్రవారం చౌట్ పల్లి లో సంఘ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో కానిస్టెన్సీలో మరిన్ని అభివృద్ధి పనులకు ఎం. పి అరవింద్ సహకారంతో నిధులను తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణంనకు నిధులను అందించిన డాక్టర్. మల్లికార్జున్ రెడ్డికి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో వేల్పూర్ మండల బిజెపి అధ్యక్షులు బేల్దారి నవీన్, బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కన్న గారి మోహన్, జిల్లా కార్యదర్శి నోముల నర్సారెడ్డి, వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి లాబిశెట్టి భానుచందర్ ,పెద్దల నాగేష్, వేల్పూర్ మాజీ సర్పంచ్ తీగల మోహన్, అలాగే ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.