పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి హోంమంత్రి అమీత్ షాను ఆహ్వానించిన ఎంపి
నిజామాబాద్, బతుకమ్మ : పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి హోంమంత్రి అమీత్ షాను సోమవారం ఎంపీ అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్‌పర్సన్ పల్లె గంగా రెడ్డిలో కలిసి న్యూఢిల్లీలో ఆహ్వానించారు. కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా తెలంగాణలోని నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని ఎంపీ అరవింద్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా జాతీయ పసుపు బోర్డు అధికారిక లోగోను కూడా ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు. ఇది భారతదేశంలో పసుపు పండించే సమాజానికి సాధికారత, ఆవిష్కరణ, ప్రపంచ...