పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరైన ఎంపీ ఈటల
హైదరాబాద్, బతుకమ్మ : జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట శుక్రవారం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. హైదరాబాదులోని బీఆర్కే భవన్లో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కమిషన్ ఆయన్ను ప్రశ్నిస్తుంది. ఆనాడు జరిగిన నిర్ణయాలు ఏమిటనే విషయాలపై...