కామారెడ్డి అర్బన్, బతుకమ్మ :
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ నేతలు నిర్వహించిన దాడి ఘటన నేపథ్యంలో మహబూబ్ నగర్ ఎంపీ, బిజెపి జాతీయ నాయకురాలు డీకే అరుణ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని అన్నారు.