ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు

బతుకమ్మ, బోధన్: బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామంలో ప్రియతమ నాయకుడు, బీజేపీ కార్యకర్తలకు అండగా నిలిచే శ్రీ ఎంపీ ధర్మపురి అరవింద్  జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్ ఆధ్వర్యంలో జగజ్జనని మహంకాళి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్ధాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు టైలు, బెల్టులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఊట్‌పల్లి, కల్దుర్కి సహా బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు రాజురే మనోహర్,...