జిల్లా కలెక్టర్ ను కలిసిన  ఎంపి ధర్మపురి అర్వింద్

  నిజామాబాద్, బతుకమ్మ: ఇటివల నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నియమితులై, భాధ్యతలను స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి ని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ మర్యాధ పుర్వకంగా కలిసారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎంపి అర్వింద్ శుబాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా లో కేంద్ర నిధుల ద్వార జరుగు పనుల విషయం లో కలిసి పని చెయాలని కోరారు.జిల్లా లో నూతనంగా నిర్మిస్తున్న అర్ ఓబిలతో పాటు నవోధయ విద్యాలయం ప్రారంభానికి సన్నహలు చేయాలని చర్చించారు.