హైదరాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని మాధవ నగర్ ఆర్ ఓ బి నిర్మాణానికి సంబంధించిన రూ.8.68 కోట్ల పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కను నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి కోరారు. గురువారం హైదరాబాద్ లో ప్రజా భవన్ లో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎంపీ అరవింద్ ధర్మపురి కలిసారు. తన వినతి తో ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో నిధులు విడుదల అవుతాయని ఎంపి ఆశాభావం వ్యక్తం చేశారు.